KMM: వైరా మున్సిపాలిటీకి చెందిన సాత్విక, నాగ మానస తేజస్విని అనే బాలికలపై గురువారం వీధి కుక్కలు దాడి చేశాయి. స్థానికుల కథనం ప్రకారం.. బాలికలు ఇంటి ఆడుకుంటుండగా వీధి కుక్కలు మూకుమ్ముడిగా దాడి చేసి గాయపరిచాయి. బాలికల అరుపులను విన్న స్థానికులు కుక్కలను చెదరగొట్టారు. అనంతరం వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.