BHPL: జిల్లాలో రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ MLA గండ్ర వెంకట రమణా రెడ్డి ఆరోపించారు. జిల్లా BRS కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సమస్యలు పెరుగుతున్నాయని, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాల నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.