NLG: మతసామరస్యం, పవిత్రతకు బక్రీద్ ప్రతీక అని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. చింతపల్లిలో ఈద్గా వద్ద గురువారం ముస్లిం సోదరులతో కలిసి బక్రీద్ వేడుకల్లో పాల్గొని, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆయన వేడుకున్నారు. శాంతి సామరస్యంతో ప్రజలు మెలగాలని సూచించారు.