JN: ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని పాలకుర్తి మండల కేంద్రంలోని విస్నూరు రోడ్డులో గల వ్యవసాయ పొలాల్లో మంటలు ఎగసి పడుతున్నాయి. దీంతో పొలాల్లో ఉన్న పలు విద్యుత్ వైర్లు, పైపులు దగ్ధమయ్యాయి అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు.