PLD: దండమూడిలో సోలార్ పలకలు ఊడిపడిన ఘటనపై డీఈఈ అశోక్ కుమార్ గురువారం స్పందించారు. ఈ నెల 26న రాత్రి వీచిన భారీ ఈదురుగాలులకే ఓ ఇంటిపై ఉన్న పలకలు పక్కింట్లో పడ్డాయని తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారికి స్వల్ప గాయమైందన్నారు. నిబంధనల ప్రకారమే సోలార్ పలకలు అమర్చామని, కేవలం ప్రకృతి వైపరీత్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.