అమెరికాలో భారతీయులకు అవమానం జరిగింది. ఓ జంట రోడ్డుపై నిలబడి ఫొటోలు తీసుకుంటుండగా ఓ వ్యక్తి ‘మీరు ఇండియా నుంచి వచ్చారా?’ అని అడిగాడు. వాళ్లు ‘అవును’ అని సమాధానమివ్వగా.. ‘మీకు ఇండియా ఇష్టమా? అమెరికా ఇష్టమా?’ అని మరో ప్రశ్న వేశాడు. ‘రెండూ ఇష్టమే. ఇండియాలో ఫ్యామిలీ ఉంటుంది’ అని వాళ్లు చెప్పగా ‘అయితే అక్కడికే వెళ్లిపోండి, ఇక్కడికెందుకు వచ్చారు’ అంటూ బూతులు తిట్టాడు.