HYD: HMWSSBలో ఇంజినీరింగ్ మేనేజర్ పోస్టులు 170కు పైగా ఖాళీగా ఉండటంతో పని భారం రోజురోజుకు పెరుగుతోంది. నీటి సరఫరా, డ్రైనేజీ నిర్వహణ వంటి కీలక విభాగాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. మరోవైపు వివిధ శాఖల నుంచి డిప్యుటేషన్‌పై ఇంజినీర్లను తీసుకొస్తుండటంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.