‘డాన్ 3’ నుంచి రణ్వీర్ సింగ్ వైదొలగడంతో, మళ్లీ షారుఖ్ ఖాన్ ఈ ఫ్రాంచైజీలోకి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ సినిమా చేయడానికి కింగ్ ఖాన్ ఒక క్రేజీ కండిషన్ పెట్టారట. ‘జవాన్’తో తనకు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన మాస్ డైరెక్టర్ అట్లీ చేతికి ఈ ప్రాజెక్ట్ ఇస్తేనే తాను ఇందులో నటించడానికి సిద్ధమని షారుఖ్ స్పష్టం చేసినట్లు బాలీవుడ్లో జోరుగా ప్రచారం సాగుతోంది.