GNTR: ఎన్టీఆర్ పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడని గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జిల్లా పరిషత్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. టీడీపీ నాయకుడు డాక్టర్ కత్తెర సురేశ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్టీఆర్ నేటి తరానికి స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శామ్యూల్ పాల్, రత్నబాబు తదితరులు పాల్గొన్నారు.