AP: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. కథానాయకుడిగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారని తెలిపారు. రాజకీయ జీవితంలో ప్రజాపక్షం వహించారని చెప్పారు. సీఎంగా ఎన్టీఆర్ సేవలు మరువలేనివని కొనియాడారు. రూ.2కే కిలో బియ్యం పథకం ద్వారా పేదల ఆకలి తీర్చారని పేర్కొన్నారు.