రామ్ చరణ్, బుచ్చిబాబుల ‘పెద్ది’ మూవీ జూన్ 4న విడుదల కానుంది. ఈ సినిమాను అనధికారికంగా ఆన్లైన్లో అప్లోడ్ చేయడం, పైరసీ కాపీలు విడుదల చేయడం వంటివి అడ్డుకోవాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో నిర్మాత పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. సినిమాకు ‘యాంటీ-పైరసీ ఇంజంక్షన్’ ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు మంజూరు చేసింది.