MBNR: మహబూబ్ నగర్ పట్టణంలోని నూతనంగా ఏర్పాటు చేసిన లిటిల్ విల్లా స్కూల్‌ను గురువారం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన విద్య ద్వారానే విద్యార్థుల భవిష్యత్తు తేజోవంతంగా మారుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.