SRPT: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాశం యాదగిరి, బక్క జడ్సన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని జనసేన నాయకుల సైదులు యాదవ్, హసన్ మియా డిమాండ్ చేశారు. హుజూర్ నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. మేధావి ముసుగులో ప్రొ. నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్‌పై విషం చిమ్మడం మానుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రమేష్, నాగరాజు, ఆకాష్ పాల్గొన్నారు.