HNK: పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా పార్టీని స్థాపించి అధికారాన్ని చేపట్టి ప్రజల పక్షాన పని చేసిన నందమూరి తారక రామారావును నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ జిల్లా కార్యదర్శి నార్ల గిరి రామలింగం అన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో గురువారం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.