VSP: తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని 33వ వార్డు టీడీపీ అధ్యక్షులు కర్రీ నీలకంఠం కొనియాడారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన సేవా కార్యక్రమాలలో నీలకంఠం పాలుపంచుకున్నారు. నిరాశ్రయులకు ఫలహారాల ప్యాకెట్లను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు.