NRML: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో భాగంగా దస్తూరాబాద్ మండలంలోని నాలుగు పాఠశాలలను పూర్వ ప్రాథమిక విద్య నిర్వహించుటకు ఎంపిక చేసినట్లు ఎంఈవో టీ. గంగాధర్ తెలిపారు. బుట్టాపూర్, గోడిసిర్యాల (ఎంపీయుపీఎస్లు), దస్తూరాబాద్, ఆకొండపేట (ఎంపీపీఎస్లు) ఎంపికైన పాఠశాలలని, వీటిలో చిన్నపిల్లల కోసం ప్రత్యేక తరగతి గదులను అందంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన పేర్కొన్నారు.