MLG: జిల్లాలో వరి, మొక్కజొన్న కోతల తర్వాత పంట అవశేషాలకు నిప్పు పెట్టడం వల్ల ఆయిల్‌పామ్ తోటలు దెబ్బతింటున్నాయని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి సంజీవరావు తెలిపారు. ఇప్పటివరకు 20.35 ఎకరాల ఆయిల్‌పామ్ తోటలు అగ్నికి ఆహుతైనట్లు వెల్లడించారు. డ్రిప్ వ్యవస్థలు, మోటార్లు కూడా దగ్ధమవుతున్నాయని పేర్కొన్నారు. పంట అవశేషాలను కాలుస్తే చర్యలు తీసుకుంటామన్నారు.