SKLM: నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా గురువారం మందస మండలం హరిపురంలో పలాస నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త వెంకన్న చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల లేసి ఘన నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.