పిల్లలు డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి. రోజంతా కొద్దికొద్దిగా నీటిని తాగించాలి. మజ్జిగ, కొబ్బరినీళ్లు, పుచ్చకాయ లాంటి నీటిశాతం ఎక్కువ ఉన్న పండ్లను ఇవ్వాలి. మధ్యాహ్నం పూట పిల్లలను ఎండలో ఆడకుండా చూసుకోవాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేయాలి. నీరసం, పెదవులు ఆరిపోవడం లాంటి లక్షణాలు ఉంటే మరింత జాగ్రత్తపడాలి.