ASR: గోవధ నిషేధం, సంరక్షణ చట్టం కఠినంగా ఉన్నాయని కొయ్యూరు మండల పశు వైద్యాధికారి డాక్టర్ రాజేష్ కుమార్ గురువారం తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులను, 3 ఏళ్ల లోపు పెయ్యలను వధించడం నిషేధమన్నారు. ఎవరైనా వాటిని వధిస్తే క్రూరత్వ నివారణ చట్టం-1962, గోవధ నిషేధం, సంరక్షణ చట్టం-1977 ద్వారా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.