MBNR: ప్రేమకు త్యాగానికి ప్రతీక బక్రీద్ పండగ అని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని ఈద్గా వద్ద బక్రీద్ పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మైనార్టీలంతా సుఖసంతోషాలతో ఆనందంగా బక్రీద్ పండగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.