MBNR: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇంటర్ ప్రవేశాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. టెన్త్ ఉత్తీర్ణులైన సుమారు 47 వేల మంది విద్యార్థులు అడ్మిషన్లపై దృష్టి సారించారు. గుర్తింపు ఉన్న కళాశాలలోనే చేరాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. జిల్లాలో మొత్తం 130 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వచ్చే నెల నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.