NDL: శ్రీశైలం తెలుగు విశ్వవిద్యాలయ పీఠం మైదానంలో నిర్వహించిన క్రికెట్ పోటీలు ముగిశాయి. శ్రీశైలం ప్రీమియర్ లీగ్ సీజన్ 3 విజేతగా ఫియర్లెస్ కోబ్రాట్స్, రన్నరఫ్గా ఎస్బీఎంఎస్ నిలిచాయి. విజేత జట్టుకు శివోహం టెంపుల్ ట్రస్ట్ నిర్వాహకులు అంతిరెడ్డి అరవింద్ రెడ్డి రూ.50 వేల నగదు, ట్రోఫీ అందజేశారు. రన్నర్ అప్ జట్టుకు బాలేశ్వయ్య డ్రోపీతో పాటు నగదు బహుమతిని అందజేశారు.