ఉమ్మడి తూ.గో. జిల్లా నుంచి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలు టీడీపీకే దక్కనున్నాయి. మరోసారి సీటు కోసం సానా సతీశ్ ప్రయత్నిస్తుండగా తాజాగా మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పేరు తెరపైకి వచ్చింది. కాపు సామాజికవర్గానికి చెందిన ఈ సౌమ్యుడైన నాయకుడు గతంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. సీనియారిటీ ఉన్న చిక్కాకే ఈసారి అవకాశం ఇవ్వాలని ఆయన అనుచరులు, అభిమానులు కోరుతున్నారు.