SRCL: కొనుగోల ప్రక్రియ ముగిసే వరకు అధికారులు ఇదే చొరవతో పని చేయాలని సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం నుంచి అధికారులతో గురువారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తడిసిన ధాన్యం విషయంలో రైతులు ఆందోళన చెందకుండా అవగాహన కల్పించాలన్నారు.