ఆసిఫాబాద్ జిల్లాలో గత 24 గంటల్లో అత్యధికంగా సిర్పూర్ (టి)లో 44.2°C ఉష్ణోగ్రత నమోదైంది. కౌటాల, దహెగాం, చింతలమానేపల్లి, రెబ్బెనల్లో 43.0°, కాగజ్ నగర్ 42.9°, బెజ్జుర్ 42.7°, ఆసిఫాబాద్లో 42.5°డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఎండ తీవ్రతకు ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.