బాపట్ల పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు పునరావిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.