KRNL: ఎమ్మిగనూరు మండలం, కోటేకల్ గ్రామంలో సీడీపీఓ సఫరున్నిసా బేగం, ఆధ్వర్యంలో “కిషోరి వికాసం” కార్యక్రమం గురువారం నిర్వహించారు. యుక్త వయస్సు బాలికలకు శరీరక వ్యాయామం, జేజే యాక్ట్, బాల్య వివాహ నిరోధక చట్టం, పోక్సో యాక్ట్‌పై అవగాహన కల్పించారు. చదువు ప్రాముఖ్యతతో పాటు ఆటలు, పాటలు, క్రీడల్లో పాల్గొనాలని, శారీరక ఎదుగుదలకు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.