HYD: భోలక్‌పూర్‌లోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం సమీపంలో గల జై లక్ష్మీ నరసింహా ట్రేడర్స్‌లో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. సెంట్రింగ్ షాప్‌లో దీపం పెట్టిపోవడంతో చెక్కలకు మంటలు అంటుకున్నట్లు సమాచారం. ఫైర్ ఇంజిన్లు సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేయడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.