HNK: ఐనవోలు మండలంలోని ఓ ఈద్గాలో గురువారం బక్రీద్ (ఈద్-ఉల్-అదా) సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో MLA నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలిపారు. బక్రీద్.. త్యాగం ప్రేమ, సోదరభావాన్ని పెంపొందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మత పెద్దలు పాల్గొన్నారు.