PPM: యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మాదక ద్రవ్యాలపై సమాజమంతా అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని జిల్లా ఈగల్ సెల్ పిలుపునిచ్చింది. డ్రగ్స్ దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, చట్టపరమైన పరిణామాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు గురువారం పార్వతీపురంలోని CMR షాపింగ్ మాల్లో అవగాహన కల్పించారు.