TG: NTRను గుర్తు చేసుకుంటూ మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు భావోద్వేగానికి గురయ్యారు. ఎన్టీఆర్ లాంటి మనసున్న నాయకుడిని మళ్లీ చూడలేమన్నారు. డబ్బు కోసం ఎగబడేవారు నాయకులు కాదన్నారు. రూపాయి లేకున్నా.. ఎన్టీఆర్ వల్లే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడున్న నేతలందరి ఆరాటమంతా డబ్బు, సీటు కోసమేనని విమర్శలు చేశారు.