BHPL: కాళేశ్వరంలో సరస్వతి అంత్యపుష్కరాల వేడుకల్లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొని పుష్కర స్నానం చేశారు. అనంతరం కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఎమ్మెల్యే సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలను అందజేశారు.