HNK: వడదెబ్బతో అంగన్వాడీ ఆయా మృతిచేందిన సంఘటన గురువారం కాజీపేట మండలం మడికొండ గ్రామంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం పల్లె సుభద్ర (45) స్థానిక అంగన్వాడీ పాఠశాలలో ఆయాగా పనిచేస్తుంది. కాగా బుధవారం వడదెబ్బకు ఆమె గురి కాగా కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా చికిత్స పొందుతు ఆమె మృతి చెందింది.