మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటి వరకు 15,046 మంది రైతుల నుంచి 83,591 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. అందులో 81,681 మెట్రిక్ టన్నులు రైస్ మిల్లులకు తరలించారు. 11,267 మంది రైతులకు సుమారు రూ.145 కోట్ల MSP చెల్లింపులు విడుదల చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా పర్యవేక్షణ కొనసాగుతోందని ఆమె తెలిపారు.