AKP: చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. చెరువుల్లో పుష్కలంగా 365 రోజులు నీరు ఉండేలా చూడాలన్నారు. ప్లాస్టిక్ రహితంగా చెరువులను తీర్చి దిద్దుతామన్నారు. గురువారం అనకాపల్లి మండలం చింత నిప్పుల అగ్రహారంలో కూలీలతో కలిసి ఉపాధి పనుల్లో పాల్గొన్నారు. పని కోసం దరఖాస్తు చేసిన 15 రోజుల్లోగా పని కల్పించాలన్నారు.