హైదరాబాద్లోని పశ్చిమ ప్రాంతాలైన దుర్గం చెరువు, ఎస్ఆర్ నగర్, మణికొండ, కూకట్పల్లి ప్రాంతాల్లో భూగర్భజలాలు రోజురోజుకు పడిపోతున్నాయి. తాగునీటికి ఇబ్బంది లేకపోయినా, నిత్యావసరాల కోసం అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు ట్యాంకర్ నీటిపై ఆధారపడుతున్నాయి. ఈ నాలుగు ప్రాంతాల్లో సగటున 35 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోవడంతో ట్యాంకర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.