PLD: చిలకలూరిపేటలో బక్రీద్ పండుగను ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. స్థానిక ఈద్గా మైదానంలో వేలాది మంది పాల్గొని సామూహిక నమాజ్ చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు ముస్లింలకు పండుగ విషెస్ తెలియజేశారు. వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.