BDK: విద్యా సంవత్సరం ప్రారంభమవనున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందాల్సిన పుస్తకాలు మండల విద్యా కేంద్రానికి చేరాయి. మణుగూరు మండలంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు కలిపి 47 ఉండగా, వాటిలో 2350 మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరి కోసం 10,369 పుస్తకాలు మణుగూరు విద్యా కేంద్రానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.