GNTR: ఐకానిక్ టవర్స్ నిర్మాణ విస్తీర్ణం తగ్గించి, బడ్జెట్ పెంచారనే వార్తలను ప్రభుత్వం తోసిపుచ్చింది. టర్న్‌కీ పద్ధతిలో 5 టవర్లలో మొత్తం 71.43 లక్షల చదరపు అడుగుల నిర్మాణాన్ని చేపడుతున్నామని, చదరపు అడుగుకు రూ.17,339 చొప్పున వ్యయం అవుతోందని స్పష్టం చేసింది. ఈ ఖర్చులోనే ఇంటీరియర్స్, డిస్ట్రిక్ట్ కూలింగ్, ఎమ్ఈపీ వసతులన్నీ కలిసి ఉన్నాయని తెలిపింది.