SRD: కంగ్టి మండలం తడ్కల్ నుంచి బాన్సువాడ వెళ్లే R&B రోడ్డు దారణంగా మారింది. తడ్కల్ సమీపంలోని రోడ్డంతా గుంతలతో నిండిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వర్షానికే నీరు నిలిచి రాకపోకలకు ఆటంకం కలుగుతుంది. నిత్యం వందలాది వాహనాలు వెళ్లే ఈ మార్గాన్ని వెంటనే మరమ్మతులు చేయాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.