BPT: చందోలులో ఇంట్లో చోరీ జరిగిందన్న ఫిర్యాదుతో ఎస్సై వెంకట శివకుమార్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఇంట్లో తనిఖీ చేయగా నగలు, వెండి వస్తువులు బీరువాలోనే సురక్షితంగా దొరికాయి. భార్య వాటి స్థానం మార్చడంతో ఈ గందరగోళం ఏర్పడింది. చోరీ జరగలేదని తేలడంతో ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. ఇంట్లో సరిచూసుకున్నాకే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్సై సూచించారు.