KNR: బక్రీద్ పండుగ సందర్భంగా కరీంనగర్ జిల్లా సాలెహ్నగర్, చింతకుంట ప్రాంతాల్లో ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇమామ్లు త్యాగం, శాంతి, సౌభ్రాతృత్వం సందేశాలు అందించారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది.