GNTR: ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని తెనాలికి చెందిన ఓ చిత్రకారుడు ఆయనకు వినూత్నంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ తల్లిదండ్రులైన నందమూరి లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ పేర్లను ఉపయోగిస్తూ ఈ చిత్రాన్ని అద్భుతంగా గీశారు. పెదరావూరు జెడ్పీ ఉన్నత పాఠశాల చిత్రకళోపాధ్యాయుడు, కార్టూనిస్ట్ పణిదెపు వెంకటకృష్ణ (కృష్ణశ్రీ) దీనిని రూపొందించారు.