ఎన్టీఆర్ : కంచికచర్ల పట్టణం పరిధిలోని ఓసి క్లబ్లో గురువారం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని మండల TDP అధ్యక్షులు కోగంటి బాబు ప్రారంభించారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు, కళ్ళజోళ్ళు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.