SRPT: నడిగూడెం మండలం కరివిరాల గ్రామంలో జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలతో కలిసి ఆర్ఐ గోపాలకృష్ణ, జూనియర్ అసిస్టెంట్, ఇతర అధికారులు పాల్గొన్నారు. జనగణనలో ప్రతి ఒక్కరూ సరైన వివరాలు అందించి ప్రభుత్వానికి సహకరించాలని అధికారులు కోరారు. గ్రామ ప్రజలు కార్యక్రమానికి మంచి స్పందన తెలిపారు.