WNP: అప్పు ఇచ్చిన వ్యక్తులు వేధింపులకు గురి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ గిరిబాబు తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. అప్పు ఇచ్చిన వారు వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా సరే మితిమీరిన అప్పు తీసుకోవద్దని సూచించారు. ఉన్నంతలో అప్పు లేకుండా హాయిగా జీవించాలని, వాటి వల్ల కుటుంబ సభ్యుల ప్రాణాలు తీయడం, ఆత్మహత్యకు పాల్పడటం నేరమన్నారు.