GNTR: రాజధాని పూలింగ్ కింద 16 ఎకరాల 70 సెంట్ల భూమిని ఇచ్చిన రైతు చింతల శ్రీరామమూర్తిని ఏపీసీఆర్డీఏ కమిషనర్ వి. విజయరామరాజు బుధవారం శాలువాతో సత్కరించారు. ఈ-లాటరీ ద్వారా ఆయనకు 11 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించి, ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు భార్గవతేజ, కార్తీక్ కూడా పాల్గొన్నారు.