TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పును BRS నేతలు వక్రీకరిస్తున్నారని ప్రభుత్వ విప్ వేముల వీరేశం మండిపడ్డారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై కొన్ని అంశాల్లో చర్యలు తీసుకోవద్దని మాత్రమే కోర్టు సూచించిందని, కానీ కేసు గెలిచినట్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందో అనే భయంతోనే BRS కోర్టును ఆశ్రయించిందన్నారు.