తిరుపతిలోని అన్న క్యాంటీన్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇంఛార్జ్ కమిషనర్ శారదా దేవి సిబ్బందిని ఆదేశించారు. స్విమ్స్ కూడలి వద్ద ఉన్న క్యాంటీన్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి భోజనం చేస్తున్న వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని, ఒక్కొక్కరికి ఒక్క టోకెన్ మాత్రమే ఇవ్వాలని సూచించారు.